: ఇతనికిదో పిచ్చి...16 ఏళ్లుగా ప్రతి రోజూ ఓ ఫోటో!


'పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి' అన్న పెద్దల మాట జేకే కెల్లర్ అనే వ్యక్తికి అతికినట్టు సరిపోతుంది. కెల్లర్ గత 16 ఏళ్లుగా రోజుకో ఫోటో చొప్పున తీసుకుంటున్నాడు. అంతే కాదండోయ్, ఆ ఫోటోను తన బ్లాగులో కూడా పెడుతున్నాడు. ఎనిమిదేళ్ల కోసారి తాను పోస్టు చేసిన ఫోటోలన్నింటిని కలిపి ఓ వీడియో తయారు చేస్తాడు. 16 ఏళ్ల క్రితం కెల్లర్ ఖరీదైన కెమేరా కొన్నాడు. ఇంత ఖరీదైన కెమేరా ఎందుకు కొన్నావంటూ అతని గర్ల్ ఫ్రెండ్ నిలదీసింది. అంతే, ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు కెల్లర్. అప్పటి నుంచి ప్రతి రోజూ ఓ ఫోటో తీయడం, దానిని తన బ్లాగులో పెట్టడం చేస్తున్నాడు. గత అక్టోబర్ లో తన ఫోటోల వీడియో పోస్టు చేశాడు. ఈ లెక్కన అతని దగ్గర ఎన్ని ఫోటోలు ఉన్నాయో ఊహించండి.

  • Loading...

More Telugu News