: మృతి చెందిన కుమారుడ్ని ఆ తల్లి రాత్రంతా ఉయ్యాలలో ఊపింది!


మృతి చెందిన కుమారుడ్ని ఓ తల్లి రాత్రంతా ఉయ్యాలలో ఉపింది. అమెరికాలోని మేరీలాండ్ ప్రాంతంలో చిన్నపిల్లలు ఆడుకునేందుకు విల్స్ స్మారక పార్కు ఉంది. ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఆ పార్కులో ఓ మహిళ తన మూడేళ్ల కొడుకును ఉయ్యాల ఊపుతూ కనిపించింది. ఆమె గత రాత్రి కూడా అలాగే ఉయ్యాల ఊపడం గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీస్ అధికారి, బాలుడు అప్పటికే మరణించి ఉండడాన్ని గుర్తించారు. అయితే, బాలుడి ఒంటిపై ఎలాంటి గాయం లేకపోవడం విశేషం. దీంతో ఆ పోలీస్ అధికారి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News