: ఈసారి ప్రతీకారం తీర్చుకుంటాం: సురేష్ రైనా
ఐపీఎల్ 2013 ఫైనల్ లో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా తెలిపాడు. బెంగళూరుపై విజయం సాధించి, ఫైనల్ లో అడుగుపెట్టడంపై సంతోషం వ్యక్తం చేసిన రైనా మాట్లాడుతూ, మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించడమే చెన్నై విజయానికి కారణమని అన్నాడు. ఈ ఎనిమిది ఎడిషన్లలో ఆటగాళ్లు మారుతున్నప్పటికీ, చెన్నై జట్టు ఆటతీరు మాత్రం నిలకడగా ఉండడానికి కారణం ధోనీయేనని చెప్పాడు. ఆరుసార్లు ఐపీఎల్ ఫైనల్ చేరడమే ధోనీ ప్రతిభకు నిదర్శనమని రైనా అభిప్రాయపడ్డాడు. ఈసారి ఫైనల్స్ లో సత్తా చాటుతామని రైనా తెలిపాడు.