: 'ఆప్' వంద రోజుల పండుగ... సోమవారం భారీ బహిరంగ సభ
ఢిల్లీలో కొలువుదీరిన ఆమ్ ఆద్మీ పార్టీ వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని సెంట్రల్ పార్కు వద్ద సోమవారం 'జన సంవాద్' పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ బహిరంగ సభలో తమ ప్రభుత్వం సాధించిన విషయాలు, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమపై పెత్తనం చెలాయించాలని చూస్తుండటం లాంటి విషయాలన్నింటినీ ప్రజలకు వివరిస్తానని చెప్పారు.