: ఏడాదిలోగా మా చేతిలో అణ్వాయుధం ఉంటుంది: ఐఎస్ఐఎస్
మరో పన్నెండు నెలల్లో అణ్వాయుధం సమకూర్చుకుంటామని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఐఎస్ఐఎస్ కు చెందిన ప్రచారపు మ్యాగజీన్ 'ద బిక్'లో అణ్వాయుధం సమకూర్చుకోవడంపై ఆర్టికల్ ప్రచురించింది. ఇందులో పాకిస్థాన్ నుంచి తాము, అణ్వాయుధాలు కొనుక్కోనున్నామని, ఏడాదిలోగా తమ అమ్ముల పొదిలో అణ్వాయుధం చేరుతుందని స్పష్టం చేసింది. అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు పాక్ కూడా అంగీకరించినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ చేతిలో అణ్వాయుధాలు పడితే, ప్రపంచానికే పెనుసవాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.