: స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆదిశేషగిరిరావు, ఉమ్మారెడ్డి
స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కృష్ణాజిల్లా నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (హీరో కృష్ణ సోదరుడు), గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఎంపిక చేసినట్టు తెలిపింది.