: జిల్లాల సర్వతోముఖాభివృద్ధికే మినీ మహానాడులు: అచ్చెన్నాయుడు
జిల్లాల సర్వతోముఖాభివృద్ధికే మినీ మహానాడులు నిర్వహిస్తున్నట్టు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తన ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ప్రజల మధ్యే ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ అవగాహన లేకుండా దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో ఏం చేశామో చర్చించేందుకు సిద్ధమని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. 2019లో కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని హామీ ఇస్తున్నామని ఆయన ధీమాగా చెప్పారు. అనంతరం కర్నూలులో ఈ రోజు నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమం ముగిసింది.