: కేరళ భవన్ కు స్థలం కేటాయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం
హైదరాబాదులోని షేక్ పేటలో 'కేరళ భవన్' నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఎకరం స్థలం కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. గతంలో కేసీఆర్ కేరళ పర్యటనకు వెళ్లినప్పుడు... కేరళలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే రీతిలో, కేరళీయం-2015 సదస్సులో కేసీఆర్ ప్రసంగిస్తూ, హైదరాబాదులో నివాసం ఉంటున్న కేరళీయుల కోసం కేరళ భవన్ కట్టిస్తానని హామీ ఇచ్చారు.