: పోలీసుల సాక్షిగా కర్రలు, రాళ్లు, సోడాబుడ్డీలతో వీరంగం


పాత కాలం సినిమా ఫైట్ గుర్తు తెచ్చేలా హైదరాబాద్లో పట్టపగలు రెండు వర్గాలు పోలీసుల సాక్షిగా తలపడ్డాయి. మాదన్నపేటలో దోభిఘాట్‌ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందిన కొందరు కబ్జా చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చేశారు. కబ్జా చేసేందుకు వచ్చిన రియల్ మాఫియా అనుచరులను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం రేగింది. కబ్జారాయుళ్ల అనుచరులు నడి రోడ్డుపై వీరంగం వేశారు. స్థానికులపై కర్రలు, రాళ్లు, సోడా సీసాలతో దాడులకు దిగారు. దీంతో స్థానికులు తిరగబడ్డారు. చేతికి అందిన వస్తువులను వారిపైకి విసిరారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా కబ్జా రాయుళ్లు తిరగబడడం విశేషం. దీంతో ఆ మార్గంలో ప్రయాణించిన వారు ఆందోళన చెందారు. గతంలో స్థానిక బస్తీవాసులు ఈ వ్యవహారంపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News