: సౌదీలో మసీదుపై దాడి చేసింది మేమే: ఐఎస్ఐఎస్
సౌదీలోని షియా ముస్లింల మసీదుపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. నిన్న ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఓ మానవ బాంబు మసీదులోకి ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా షియా తెగకు చెందిన వారే. షియాలు ఎక్కువగా ఉండే కటిఫ్ ప్రావిన్స్ లోని పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతంలోని కుదాయ గ్రామంలో ఈ దారుణం జరిగింది.