: కేసీఆర్ పై రాజకీయ నిర్భయ కేసు పెట్టాలి: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎప్పటిలానే టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై రాజకీయ నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకున్న వారికే ఎమ్మెల్సీ పదవులిచ్చారని, కోదండరామ్, దేవీప్రసాద్, జయశంకర్, అమరవీరుల వంటి కుటుంబాలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. విలువలతో రాజకీయం అని చెప్పిన సీఎం కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా ఓటు వేసి సీఎంకు గుణపాఠం చెప్పాలని కోరారు.