: రేపు వీఐపీ, బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ


తిరుమలకు భక్తుల రద్దీ నేపథ్యంలో రేపు వీఐపీ, బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. వారందరికీ త్వరగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జేఈవో వెల్లడించారు. దక్షిణ మాఢవీధిలో తాత్కాలికంగా అదనపు క్యూలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు క్యూలైన్ల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నామని వివరించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ అందిస్తున్నామని జేఈవో వివరించారు.

  • Loading...

More Telugu News