: సల్మాన్ కు కితాబిచ్చిన హాలీవుడ్ స్టార్


బాలీవుడ్ హీరో సల్మాన్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన కోట్లాది మందికి అభిమాన హీరో అయితే, ఆయన అభిమాన హీరో సిల్వెస్టర్ స్టాలోన్. ఇప్పుడా అభిమాన హీరో సల్మాన్ కు కితాబిచ్చారు. ప్రతిభావంతుడైన సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాదు, ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దామని, బహుశా అది 'న్యూ ఎక్స్ పెండబుల్స్' సినిమా అవ్వచ్చేమో అని కూడా స్టాలోన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. స్టాలోన్ నటించిన 'ఎక్స్ పెండబుల్స్' సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. అంతకుముందు, సల్మాన్ ట్విట్టర్లో తన అభిమాన హీరో గురించి ఫ్యాన్స్ కు సూచనలు చేశారు. "అభిమానులూ... స్టాలోన్... మీ హీరోకే హీరో... ఆయనను ట్విట్టర్లో ఫాలో అవండి" అంటూ ట్వీట్ చేశారు. దీనిపైనే స్టాలోన్ స్పందించారు.

  • Loading...

More Telugu News