: పనుల్లో వేగం పెంచండి... అవినీతికి పాల్పడితే సహించను: కలెక్టర్లకు చంద్రబాబు హెచ్చరిక


ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాదులోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లందరూ హాజరయ్యారు. అంతేకాకుండా, పలువురు రాష్ట్ర మంత్రులు కూడా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పారదర్శకంగా పని చేయాలని, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించనని హెచ్చరించారు. ఎండ తీవ్రత అధికంగా ఉందని... వడదెబ్బ తగలకుండా గ్రామాల్లో సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన వారికి మజ్జిగ అందించాలని ఆదేశించారు. రైతు సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పారు. రైతు రుణమాఫీ ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. బదిలీలతో ఉద్యోగులను వేధించకూడదని... బదిలీని చివరి అస్త్రంగానే ఉపయోగించాలని అన్నారు.

  • Loading...

More Telugu News