: కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి రెడ్డి


కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ మినీ మహానాడు కాసేపటి క్రితం కర్నూలులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా, చక్రపాణి రెడ్డి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు తదితర నేతలు హాజరయ్యారు. భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో మినీ మహానాడు ప్రాంగణం కళకళలాడుతోంది. అభిమానులు ఎండ వేడిమిని సైతం భరిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

  • Loading...

More Telugu News