: సినిమా పరిశ్రమ ఎవరి సొత్తూ కాదు: నటుడు మోహన్ బాబు
సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరైన సినీ నటుడు మోహన్ బాబు మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదన్నారు. చిన్న సినిమాలు తీసేవాళ్లే అసలైన నిర్మాతలని పేర్కొన్నారు. కొందరు ఫైనాన్షియర్ల సాయంతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి డబ్బులు ఎగ్గొడుతున్నారని విమర్శించారు. ఫైనాన్షియర్లను మోసం చేసేవాడు నిర్మాత కాదని, తానెప్పుడూ చిన్న నిర్మాతల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన 'దొంగాట' సినిమా సక్సెస్ మీట్ లో మోహన్ బాబు మాట్లాడారు. టాలీవుడ్ లో ఇటీవలి పరిణామాలపై త్వరలో స్పందిస్తానని చెప్పారు. దొంగ సినిమా పరిశ్రమలో గాలి కబుర్లు ఎక్కువయ్యాయని, సినిమా విలన్లు నిజజీవితంలో విలన్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు.