: బీజేపీ మ్యానిఫెస్టో పత్రాలను దహనం చేస్తాం: రఘువీరారెడ్డి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడాది పాలనపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శలు చేశారు. ఈ సంవత్సర పాలనలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ నెల 26న ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ మ్యానిఫెస్టో పత్రాలను దహనం చేస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేస్తామన్న బీజేపీ వాటిని రెట్టింపు చేసిందన్నారు. తమది క్లీన్ టీం అని చెప్పుకుంటున్న మోదీ మంత్రివర్గంలో 16 మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని రఘువీరా ఆరోపించారు.