: పవన్ కల్యాణ్ గడ్డం పెంచడానికి ఇదే కారణమట!


జనసేన అధినేత, ప్రముఖ టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ ఈ మధ్య కాలంలో గడ్డం పెంచుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సినీ వర్గాల్లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లో కూడా ఈ గడ్డం గురించి ఆసక్తి నెలకొంది. కనీసం ట్రిమ్ కూడా చేయించుకోకుండా ఆయన గడ్డాన్ని పెంచుతున్నారు. గబ్బర్ సింగ్-2 సినిమా కోసం గడ్డం పెంచుతున్నారా? అన్న సంశయం చాలా మందిలో ఉంది. అయితే, దీనికి సంబంధించి కొంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. విశ్వంజీ అనే స్వామీజీ ఇచ్చిన సలహా మేరకే పవన్ కల్యాణ్ గడ్డం పెంచుతున్నారట. 42 రోజుల దీక్షను పవన్ చేపట్టినట్టు సమాచారం. పవన్ అత్యంత సన్నిహితుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... విశ్వంజీ భక్తుడు. 'అత్తారింటికి దారేది' సినిమా సమయంలో విశ్వంజీ హోమం కూడా నిర్వహించారట. విశ్వంజీ సలహాతోనే పవన్ దీక్ష చేపట్టారట. అయితే, ఈ దీక్ష సినిమాల కోసమా? రాజకీయాల కోసమా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

  • Loading...

More Telugu News