: అమ్మ ప్రమాణస్వీకారానికి హాజరైన సూపర్ స్టార్ రజనీ
కాసేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమె చేత రాష్ట్ర గవర్నర్ రోశయ్య ప్రమాణం చేయించనున్నారు. మద్రాస్ యూనివర్శిటీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీఐపీలు తరలివచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మరో నటుడు శరత్ కుమార్, బీసీసీఐ మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకప్పుడు జయకు బద్ద శత్రువైన రజనీకాంత్, ఆమె ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడం అన్నా డీఎంకే వర్గాలను ఆనందంలో ముంచెత్తింది. అంతేకాక, జయ సన్నిహితురాలు శశికళ కూడా వచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ ఐదో సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జయతో పాటు మరో 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.