: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మోకాలికి గాయం కావడంతో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో, ఆయన మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని... ఎలాంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో, నిన్న సాయంత్రం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, తన నివాసానికి చేరుకున్నారు. అయితే, మరో నాలుగు రోజుల పాటు, పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని షారుఖ్ కు వైద్యులు సూచించారు. ప్రస్తుతం కింగ్ ఖాన్ 'రాయిస్' అనే సినిమాలో నటిస్తున్నారు.