: వారి పట్ల సానుభూతి చూపడం తప్ప ఇంకేం చెప్పగలను?: వెంకయ్య
నరేంద్ర మోదీ ఏడాది పాలన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... మోదీ పాలనకు కితాబిచ్చారు. అదే సమయంలో యూపీఏ పాలనను విమర్శించారు. యూపీఏ దోపిడీలు, అబద్ధాలు, మోసాలతో సరిపెట్టుకుందని దుయ్యబట్టారు. మోదీ పాలనలో దేశ ప్రతిష్ఠ పెరుగుతుండడం, ప్రపంచవ్యాప్తంగా భారత్ కు గౌరవం లభిస్తుండడం చూసి అతి పురాతన పార్టీ విచారంలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. వారి పరిస్థితి పట్ల సానుభూతి చూపడం తప్ప, దీనిపై తాను ఇంకేం చెప్పగలనని వెంకయ్య అన్నారు. మోదీ పాలన పట్ల సగటు పౌరుడు సంతోషంగా ఉన్నాడని, దేశానికి లభిస్తున్న గౌరవం చూసి గర్విస్తున్నాడని చెప్పుకొచ్చారు.