: జూన్ 1 నుంచి తెలంగాణ దేవాలయాలలో ఆవిర్భావ దినోత్సవాలు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2తో ఏడాది పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ అర్చక సమాఖ్య సంఘం నిర్ణయించింది. అయితే ఒకరోజు ముందునుంచే అంటే జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్టు అర్చక సమాఖ్య సంఘం అధ్యక్షుడు రంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఇందులో భాగంగా ఎనిమిదివేల దేవాలయాలలో విద్యుత్ దీపాలంకరణ, సహస్ర దీపాలంకరణ, ప్రసాద పంపిణీ చేపట్టాలని అర్చకులకు సూచించారు. అంతేగాక 10 జిల్లాల్లో 700 మంది పండితులు, అర్చకులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుందని శర్మ వెల్లడించారు. ఆలయాల పూజల నిర్వహణకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరామని తెలిపారు.

  • Loading...

More Telugu News