: ప్రమాణస్వీకారానికి ఇంటి నుంచి బయలు దేరిన 'అమ్మ'... రోడ్డుకిరువైపులా అభిమానుల కోలాహలం
ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అధిరోహించడానికి తన నివాసం నుంచి బయలుదేరారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఆమె తరలివెళ్లారు. ఈ క్రమంలో, చెన్నైలోని ఆమె నివాసం నుంచి రోడ్డుకు ఇరువైపులా జయ అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు బారులు తీరారు. జయకు చేతులు ఊపుతూ, నమస్కారం చేస్తూ... పురచ్చితలైవికి బ్రహ్మరథం పడుతున్నారు. కాసేపట్లో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకు జయ స్థానంలో తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన పన్నీర్ సెల్వం... ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.