: తాతకు నివాళులర్పించిన జగన్


నేడు పులివెందులలో వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాత వైఎస్ రాజారెడ్డికి నివాళులర్పించారు. జగన్ శుక్రవారం హైదరాబాదులో బయల్దేరి ఈ ఉదయం పులివెందుల చేరుకున్నారు. అనంతరం, రాజారెడ్డి ఘాట్ వద్దకు వెళ్లి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జగన్ వెంట బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి తదితరులున్నారు.

  • Loading...

More Telugu News