: తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతున్న భానుడి ప్రతాపం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో బయటికెళ్లేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ విభాగం చెబుతోంది. మండే ఎండలకు తోడు పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో, పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో రోడ్లు బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో వడదెబ్బ మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.