: తెలంగాణలో మూగ జీవాలకూ '108' తరహా సేవలు


తెలంగాణ రాష్ట్రంలో పశువుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. మూగ జీవాలకు ఆపద సమయంలో అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా 108 తరహా సర్వీసులను ప్రారంభించాలని టి.సర్కారు యోచిస్తోంది. మెదక్ జిల్లా పెద్దకంజర్ల గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి పశుప్రదర్శనలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ విషయం తెలిపారు. త్వరలోనే క్యాబినెట్ భేటీలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రతి గ్రామంలో రైతుల ఇంటి పశు సంపద వర్ధిల్లాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News