: రాణించిన గేల్, సర్ఫరాజ్, కార్తిక్...బెంగళూరు 139/8


ఐపీఎల్ సీజన్-8లో అత్యంత రసవత్తరమైన పోరుగా అభివర్ణించిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరులో బెంగళూరు జట్టు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. చెన్నై బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు బెంగళూరు బ్యాట్స్ మన్ వద్ద సమాధానమే లేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు ఆదిలోనే కెప్టెన్ కోహ్లీ (12), డివిలియర్స్ (1), మన్ దీప్ సింగ్ (4) వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. గేల్ (41) క్రీజులో ఉన్నప్పటికీ సహజసిద్ధంగా ఆడలేకపోయాడు. దినేష్ కార్తిక్ (28) సహకారమందించేందుకే పరిమితమయ్యాడు. దీంతో బెంగళూరు జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేదు. అనంతరం వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (31) మెరుపులు మెరిపించాడు. వైస్ (12) భారీ షాట్ కు యత్నించి విఫలమయ్యాడు. హర్షల్ పటేల్ (2) అవుటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఆశిష్ నెహ్రా నిప్పులు చెరిగే బంతులతో మూడు వికెట్లు తీయగా, అతనికి మోహిత్, బ్రావో, రైనా, అశ్విన్ తలో వికెట్ తీసి సహకరించారు. 140 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News