: సెల్ఫీ పిచ్చి... ప్రాణాలు హరిస్తోంది!


సెల్ఫీల పిచ్చి హద్దులు దాటుతోంది. యువత పిచ్చి వ్యామోహాన్ని గమనించిన ఓ యూనివర్సిటీ సెల్ఫీపై ప్రత్యేక కోర్సు ప్రవేశపెట్టగా... సెల్పీలు తీసుకుంటూ పలువురు యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రష్యాలోని మాస్కోలో ఓ మహిళ తన కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డు దగ్గరి పెల్లెట్ తుపాకీ తీసుకుని, తలకు గురిపెట్టుకుని సెల్ఫీ దిగాలని భావించింది. ఈ క్రమంలో ట్రిగ్గర్ మీద వేలు పెట్టి పేల్చుకుంది. దీంతో తీవ్రగాయాలతో ఆమె ఆసుపత్రిలో చేరింది. సెంట్రల్ మాస్కోలోని ఆర్చ్ డ్ బ్రిడ్జి నుంచి దూకుతూ ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో ఐదో అంతస్తు నుంచి దూకుతూ 9వ తరగతి విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది.

  • Loading...

More Telugu News