: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు... బెంగళూరు 41/3


చెన్నై బౌలర్లు నిప్పులు చెరిగారు. రాంచీలోని జేసీఎస్సీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు కేవలం 36 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కోహ్లీ (12), డివిలియర్స్ (1), మన్ దీప్ సింగ్ (4) దారుణంగా విఫలమవ్వడంతో తొమ్మిది ఓవర్లు ఆడిన బెంగళూరు 3 కీలకమైన వికెట్లు కోల్పోయి కేవలం 41 పరుగులే చేసింది. క్రీజులో క్రిస్ గేల్ (21)కు దినేష్ కార్తిక్ (3) జతకలిశాడు. చెన్నై బౌలర్లలో నెహ్రా రెండు వికెట్లతో రాణించగా, అశ్విన్ అతనికి చక్కని సహకారమందించాడు.

  • Loading...

More Telugu News