: రామ్ చరణ్ విమానం గాల్లోకెగసింది!
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ సినిమాలే కాకుండా ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పోలో టీమ్, ఫిట్ నెస్ వ్యాపారాలు... ఇలా బిజినెస్ మేన్ గా ఆయన బిజీ అయిపోయారు. చెర్రీ కొన్నాళ్ల కిందట 'టర్బో మేఘా' పేరిట ఓ విమానయాన సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ విమాన సర్వీసులు నేడు ప్రారంభమయ్యాయి. టర్బో మేఘా సర్వీసులను రామ్ చరణ్ ప్రారంభించారు. తొలి విమానం మలేసియా నుంచి బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. వీటిలో 70 మంది వరకు ప్రయాణించవచ్చు. టర్బో మేఘా తొలుత మధ్య తరహా విమానాలను పరిమిత సంఖ్యలో, కొన్ని రూట్లలోనే నడపాలని నిర్ణయించింది. తర్వాత, సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది.