: బహిరంగ లేఖలో కేసీఆర్ ను నిలదీసిన టీటీడీపీ అధికార ప్రతినిధి


తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, విద్యార్థి నేత రాజారాం యాదవ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ఉస్మానియా యూనివర్శిటీ భూములను పేదల ఇళ్ల పేరిట లాక్కునేందుకు యత్నించడం సరికాదని హితవు పలికారు. ఒకప్పుడు రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని గర్జించారని గుర్తు చేశారు. ఇప్పుడదే ఫిలింసిటీ స్వర్గంలా కనిపిస్తోందా? ఉస్మానియా వర్శిటీ మాత్రం పోరగాళ్ల కేంద్రంలా కనిపిస్తోందా? అని లేఖలో ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం పీఠంపై ఉన్నారంటే అది ఓయూ విద్యార్థుల వల్లేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా వర్శిటీ విద్యార్థులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News