: డిజైనర్ అవతారమెత్తిన బాలీవుడ్ స్టార్ హీరో


బాలీవుడ్ లో ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చెఫ్ స్థాయి నుంచి స్టార్ హీరో వరకు ఎదిగిన అక్షయ్ కుమార్ డిజైనర్ అవతారంలో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. ఆన్ లైన్ వ్యాపార సంస్థ 'బెస్ట్ డీల్' ద్వారా ఆయన 'క్లోథింగ్ లైన్' ప్రారంభించనున్నారు. తాను డిజైన్ చేసిన దుస్తులను సరసమైన ధరలకే విక్రయిస్తానంటూ ఆయన కొన్ని ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టారు. టీషర్టును 999 రూపాయలకు ఎంత మంది కొనగలరు? అది సరసమైన ధర అవునా? కాదా? మీ సమాధానం ఎస్ లేదా నో రూపంలో చెప్పండి... అంటూ అభిమానులను అక్షయ్ కోరాడు. కాగా, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, సోనమ్ కపూర్, అలియా భట్ తదితరులు వస్త్ర వ్యాపారంలో ఉన్నారు. తాజాగా అక్షయ్ కూడా వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టడం విశేషం.

  • Loading...

More Telugu News