: ధనవంతులు కాదు... అదృష్టమంటే వీళ్లదే!
ముంబై వంటి మహానగరంలో, అది కూడా సముద్రతీర ప్రాంతంలో ఇల్లు కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి! అద్భుతమైన బీచ్ వాతావరణం అంటే అందరికీ ఇష్టమే కదా. ఇప్పటివరకు ముంబైలో బీచ్ అభిముఖ నివాసాలంటే సెలబ్రిటీలవే అధికంగా ఉన్నాయి. అయితే, బీచ్ లో నివాసం ధనవంతులకే సొంతం కాదని మహారాష్ట్ర సర్కారు నిరూపించింది. రాజ్ భవన్ ఉద్యోగులకు ఖరీదైన సముద్ర తీర ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇచ్చింది. 14 అంతస్తుల్లో నిర్మించిన భారీ భవన సముదాయంలో రాజ్ భవన్ జూనియర్ గ్రేడ్ (గ్రూప్-సి, గ్రూప్-డి) సిబ్బందికి ఇళ్లు కేటాయించారు. మొత్తం 63 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఈ హౌసింగ్ కాంప్లెక్స్ ను ఈ నెల 26న సీఎం ఫడ్నవీస్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అధ్యక్షత వహిస్తారు.