: కోహ్లీ ప్రియురాలి నటనను ప్రశంసించిన ప్రియాంక చోప్రా


బాలీవుడ్ లో హీరోయన్ల మధ్య పోటీ సర్వసాధారణం. దీంతో హీరోయిన్ల మధ్య స్నేహం సంగతి అటుంచితే వివాదాలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక హీరోయిన్ ను ఇంకొకరు పొగిడితే మనం ఆశ్చర్యపోవాల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ నటనను ఆకాశానికెత్తేసింది. ఈ మధ్యే అమెరికా సీరియల్ లో నటించి ముంబై చేరిన ప్రియాంక విరామ సమయాల్లో సినిమాలు చూస్తూ గడిపేస్తోంది. ఈ నేపధ్యంలో అనుష్క శర్మ నటించిన 'ఎన్ హెచ్ 10' సినిమా చూసింది. ఈ సినిమాలో అనుష్క నటన అద్భుతమని కొనియాడింది. బాలీవుడ్ లో మార్పులు వస్తున్నాయని, నిర్మాతలు హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారని ప్రియాంక తెలిపింది. దీపికా పదుకునే నటించిన 'పీకూ' బాగుందని టాక్ వస్తోందని, కంగనా నటించిన 'తను వెడ్స్ మను 2' త్వరలో విడుదల కానుందని, ఇది బాలీవుడ్ సినిమాలకు శుభసూచకంగా నిలుస్తోందని ప్రియాంక తెలిపింది.

  • Loading...

More Telugu News