: మద్రాస్ యూనివర్శిటీ ఆడిటోరియంలో జయ ప్రమాణ స్వీకారం


తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని మద్రాస్ యూనివర్శిటీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుందని రాజ్ భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జయతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, అన్నా డీఎంకే కార్యకర్తలు, భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎనిమిది నెలల తరువాత ఈ రోజు మీడియాకు కనిపించిన జయ... గవర్నర్ రోశయ్యను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News