: అజ్ఞాతంలో లాడెన్ చదివిన పుస్తకాలివే...!


అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ స్థాపించి అగ్రరాజ్యం అమెరికాపైనే దాడిచేసిన ఒసామా బిన్ లాడెన్ అనేక సంవత్సరాలు అజ్ఞాతంలోనే గడిపాడు. అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ లో ప్రవేశించాక ఆయన పాక్ సరిహద్దులోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ లోని అబ్బొట్టాబాద్ లోని ఓ ఇంట్లో యూఎస్ నేవీ సీల్స్ చేతిలో హతమయ్యాడు. లాడెన్ నివాసం నుంచి పెద్ద ఎత్తున పత్రాలు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలను అమెరికా ఇటీవల వెల్లడించింది. ఈ సందర్భంగా, అజ్ఞాతంలో లాడెన్ చదివిన పుస్తకాల జాబితాను మీడియాకు తెలిపింది. వాటిలో కొన్ని... 1. ఏ బ్రీఫ్ గైడ్ టు అండర్ స్టాండింగ్ ఇస్లాం 2. అమెరికా'స్ స్ట్రాటజిక్ బ్లండర్స్ 3. అమెరికా'స్ వార్ ఆన్ టెర్రరిజం 4. అల్ ఖైదా'స్ ఆన్ లైన్ మీడియా స్ట్రాటజీస్: ఫ్రమ్ అబు రాయిటర్ టు ఇర్హబి 007 5. ద బెస్ట్ డెమోక్రసీ మనీ కెన్ బై 6. ద బెస్ట్ ఎనిమీ మనీ కెన్ బై 7. బ్లాక్ బాక్స్ ఓటింగ్, బ్యాలెట్ టాంపరింగ్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ 8. బ్లడ్ లైన్స్ ఆఫ్ ద ఇల్యూమినాటి 9. చెకింగ్ ఇరాన్'స్ న్యూక్లియర్ యాంబిషన్స్ 10. క్రిస్టియానిటీ అండ్ ఇస్లామ్ ఇన్ స్పెయిన్ 756-1031 ఎ.డి. 11. కిల్లింగ్ హోప్: యూఎస్ మిలిటరీ అండ్ సీఐఏ ఇంటర్వెన్షన్స్ సిన్స్ వరల్డ్ వార్ 2 12. మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్లండర్స్ 13. ప్రాజెక్ట్ ఎంకేయుఎల్టీఆర్ఏ, ద సీఐఏ'స్ ప్రోగ్రామ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ బిహేవియరల్ మోడిఫికేషన్... 14. న్యూ పెర్ల్ హార్బర్: డిస్టర్బింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద బుష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ 9/11 15. నెససరీ ఇల్యూజన్స్: థాట్ కంట్రోల్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీస్ 16. ఒబామా'స్ వార్స్ 17. ఆక్స్ ఫర్డ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ వార్ 18. ద టేకింగ్ ఆఫ్ అమెరికా 1-2-3 19. అన్ ఫినిష్ డ్ బిజినెస్, యూఎస్ ఓవర్సీస్ మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ 20. సీక్రెట్స్ ఆఫ్ ఫెడరల్ రిజర్వ్

  • Loading...

More Telugu News