: రాజంటే ఇతడే... వచ్చేశాడు!


బాహుబలి చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా ఇతర పాత్రధారుల పోస్టర్లు విడుదల చేసిన దర్శకుడు రాజమౌళి తాజాగా, ప్రధాన పాత్రధారి బాహుబలి పోస్టర్ ను విడుదల చేశారు. 'ద ట్రూ కింగ్' అని పోస్టర్ కు సబ్ టైటిల్ పెట్టారు. అంతేగాకుండా, 'సాహస విక్రమ ధీశాలి! రణతంత్ర కళా కుశలి!!' అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, ఈ పోస్టర్లో బాహుబలి పాత్రధారి ప్రభాస్ ఆయుధం చేతబూని శత్రువుల రక్తాన్ని చిందిస్తుండడం చూడొచ్చు. శత్రు సేనలను చెల్లాచెదురుచేస్తూ తన శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టున్న ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది.

  • Loading...

More Telugu News