: ఢిల్లీ ప్రజలను కేంద్రం వెన్నుపోటు పొడిచింది: కేజ్రీవాల్
ఢిల్లీ ప్రజలను కేంద్రం వెన్నుపోటు పొడిచిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకుని, అధికారం చెలాయించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రం గెజిట్ జారీ చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అధికారుల నియామకం, బదిలీల్లో జరిగే అవినీతికి అడ్డుకట్ట వేశామని, దాంతో తమకు మంచి పేరు వస్తుందన్న ఆందోళనతోనే కేంద్రం తమను లక్ష్యంగా చేసుకుందని ఆయన అన్నారు. కాగా, కేంద్రం గెజిట్ పై ఆయన రాష్ట్రపతిని కలవనున్నారు.