: అక్కడ మళ్లీ పాకిస్థాన్ జెండాల రెపరెపలు


జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మరోసారి పాకిస్థాన్ జెండాలు రెపరెపలాడాయి. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ మద్దతుదారులు పాకిస్థాన్ జెండాలతో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా జెండాలను కూడా ప్రదర్శించారు. అంతేగాకుండా, ర్యాలీ సందర్భంగా భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. ఇద్దరు నేతల వర్ధంతి నేపథ్యంలో, హురియత్ కాన్ఫరెన్స్ ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో, ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఫరూక్ ను గృహనిర్బంధంలో ఉంచారు.

  • Loading...

More Telugu News