: దేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలలో త్వరలో వైఫై సేవలు


దేశంలోని పలు ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, త్వరలోనే దేశ వ్యాప్తంగా ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో వైఫై సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. "తాజ్ మహల్, సార్ నాథ్, బుద్ధగయ ఇంకా పలు ప్రాంతాల్లో వైఫై సేవలు తీసుకువస్తాం. ఇప్పటికే వారణాసి ఘాట్స్ వద్ద ఉచిత వైఫై సేవలను అందిస్తున్నాము. అంతేగాక పర్యాటకులకు ఈ-వీసా జారీచేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము" అని మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News