: 2.5లక్షలకు అమ్ముడుపోయిన ప్రియాంక షూ
చిన్నారుల భద్రత కోసం యునిసెఫ్ తో కలిసి 'సేవ్ ద గర్ల్' అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నటి ప్రియాంకా చోప్రా వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కోసం తన షూలను వేలం వేసింది. ప్రియాంకతోపాటు, డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్ ఆటోగ్రాఫ్ చేసి ఉన్న ఈ షూ జతను ఔత్సాహికులు రెండున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. సరిగ్గా ఇలాంటి షూ జతనే ప్రియాంకా 'ఎగ్జోటిక్' చిత్రంలో ధరించింది.