: గవర్నర్ రోశయ్యను కలసిన జయలలిత
అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కొద్దిసేపటి కిందట గవర్నర్ రోశయ్యను రాజ్ భవన్ లో కలిశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం ఈ రోజు రాజీనామా చేయడంతో రోశయ్య దానిని ఆమోదించారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ జయను రోశయ్య ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆమె గవర్నర్ ను కలిశారు. అటు పార్టీ ఎమ్మెల్యేలు తనను లెజిస్లేచర్ నాయకురాలిగా ఎన్నుకున్న నేపథ్యంలో రేపు ఉదయం జయ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.