: ఈ ఎండల గోలేంటి?... అధికారులపై బాబు ప్రశ్నల వర్షం!
ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలపై ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి? ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏం చేస్తున్నారు? నిన్నటి మృతుల సంఖ్య నిజమేనా? అందరూ ఎండ కారణంగానే మరణించారా? అని ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. కాగా, నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రికార్డు స్థాయి ఎండలపై ఆయన సహచరులతో చర్చించనున్నారని తెలుస్తోంది.