: సీనియర్ నటి బిందుమాధవి కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటి బిందుమాధవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన బిందుమాధవి, పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.