: జయలలితకు ఫోన్ లో సీఎం కేసీఆర్ అభినందనలు
ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అన్నా డీఎంకే శాసనసభాపక్ష నాయకురాలిగా మరోసారి పార్టీ ఎమ్మెల్యేలు జయను ఎన్నుకున్న నేపథ్యంలో కేసీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అక్రమాస్తుల కేసులో జయ నిర్దోషి అంటూ కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చిన క్రమంలో మరోసారి తమిళనాడు సీఎం అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రేపు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.