: షారూక్ ఖాన్ కు ముంబైలో ఆపరేషన్
గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న షారూక్ ఖాన్ కు ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో వైద్యులు షారూక్ ఎడమ మోకాలికి ఆపరేషన్ చేశారు. నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఓ సినిమా షూటింగులో భాగంగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న వేళ ఆయన మోకాలి నొప్పి తీవ్రమైన సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆయన ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. కాగా, ఆపరేషన్ విజయవంతమైందని, ఆయనను నేడు డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ, అండగా నిలిచిన అభిమానులకు షారూక్ ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు.