: ప్రభుత్వ ఏర్పాటుకు జయను ఆహ్వానించిన రోశయ్య
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇచ్చిన రాజీనామాను రోశయ్య ఆమోదించారని రాజ్ భవన్ అధికారులు వివరించారు. కాగా, నేటి మధ్యాహ్నం జయలలిత గవర్నర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్న సంగతి తెలిసిందే. రేపు ఆమె తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలావుండగా, చెన్నై పోయిస్ గార్డెన్ నివాసం జయలలిత అభిమానులు, పార్టీ నేతలతో కిటకిటలాడుతోంది. పెద్దఎత్తున ప్రజలు అక్కడికి తరలి వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.