: ఏడేళ్ల నుంచి ఒకే వేతనం... ఈ సంవత్సరమూ పెంచవద్దన్న ముఖేష్ అంబానీ


భారత కార్పొరేట్ దిగ్గజం, ఇండియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన వేతనాన్ని ఈ సంవత్సరమూ పెంచవద్దని రిలయన్స్ ఇండస్ట్రీస్ ను కోరారు. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన 2008లో, సీఈఓల వేతనాలు అధికంగా ఉన్నాయని విమర్శలు రాగా, ఆయన తన వేతనాన్ని పెంచవద్దని తొలిసారి కోరారు. ఆ సంవత్సరం ఆయన తీసుకున్నది రూ. 15 కోట్లు. అప్పటి నుంచి ఈ ఆరేళ్లూ అదే వేతనాన్ని ఆయన కొనసాగించారు. ఈ సంవత్సరం కూడా తనకు ఎటువంటి ఇంక్రిమెంట్ అక్కర్లేదని తెలిపారు. వాస్తవానికి 2008-09లో సంస్థ ఆయనకు రూ. 24 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. 2014-15 నాటికి అది రూ. 38.86 కోట్లకు చేరింది. కాగా, 2013-14లో ఆయనకు వేతనంగా రూ. 4.16 కోట్లు, అలవెన్సుల రూపంలో రూ. 60 లక్షలు, రిటైర్ మెంట్ బెనిఫిట్ గా రూ. 83 లక్షలు, లాభాల్లో కమీషన్ గా రూ. 9.42 కోట్లు లభించాయి. ఆయన భార్య, రిలయన్స్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న నీతా అంబానీకి రూ. 5 లక్షల సిట్టింగ్ ఫీజు, కమీషన్ రూపంలో రూ. 78.64 కోట్లు లభించిందని సంస్థ వార్షిక నివేదిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News