: ఒక్క రూపాయితో ఒక కిలోమీటర్... ఎయిర్ ఆసియా కొత్త ఆఫర్


ఒక కిలోమీటరు ప్రయాణానికి ఏసీ వోల్వో బస్సులో రూపాయిన్నరకు పైగానే రవాణా సంస్థలు వసూలు చేస్తున్న తరుణంలో రూపాయికి కిలోమీటరు దూరం ప్రయాణించండని ఎయిర్ ఆసియా వినూత్న ఆఫర్ ను ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ ఢిల్లీ నుంచి సర్వీసులను ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త ఆఫరును ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 24 వరకూ ఈ ఆఫర్ ను వాడుకొని టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ తేదీ జూన్ 18 నుంచి వచ్చే సంవత్సరం మే 31 మధ్య ఉండాలని వెల్లడించింది. కాగా, ఈ ఆఫర్ లో భాగంగా న్యూఢిల్లీ, గౌహతి మధ్య రూ. 1,500కు, గోవా, బెంగళూరులకు రూ. 1,700కే (అన్ని పన్నులూ కలుపుకొని)కే విమాన ప్రయాణం చెయ్యవచ్చు. ప్రస్తుతం ఎయిర్ ఆసియా చెన్నై, కొచ్చి, గోవా, చండీగఢ్, జైపూర్, పుణె నగరాల నుంచి విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. సమీప భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించాలన్నది సంస్థ అభిమతం.

  • Loading...

More Telugu News