: 'నిను చూడక నేనుండలేను' అంటున్న సురేష్ రైనా
ఒకవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో స్థానం కోసం చెన్నై జట్టు ఆటగాళ్లంతా బిజీబిజీగా గడుపుతుంటే, సురేష్ రైనా మాత్రం ఒకింత బాధ పడుతున్నాడు. తన భార్యను చూడకుండా ఉండలేకపోతున్నాడట. ఈ విషయాన్ని రైనా స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. "నా ప్రియా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా" (Can't wait to see u my love) అని వ్యాఖ్యానించాడు. ట్విట్టర్ ఖాతాలో తన భార్య చిత్రాన్ని కూడా రైనా పోస్ట్ చేశాడు. కాగా, రైనా తన చిన్ననాటి ఫ్రెండ్ ప్రియాంకా చౌదరిని గత నెల మొదటి వారంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరల్డ్ కప్, పెళ్లి తరువాత ఐపీఎల్ పోటీలతో బిజీగా ఉన్న రైనా ఇంతవరకూ భార్యతో గడిపేందుకు సమయం కేటాయించలేకపోయాడట. ఐపీఎల్ ముగిసిన తరువాత బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరే వరకూ మరే వ్యాపకమూ పెట్టుకోకూడదని రైనా అనుకుంటున్నాడట.